అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆందోళన రేపుతున్నాయి.
ఇరాన్‌కు అనుబంధమైన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఈ కీలక జలసంధిలో ఉన్న సముద్రగర్భ కేబుళ్లకు ఏదైనా నష్టం జరిగితే పర్షియన్ గల్ఫ్ అంతటా తీవ్ర అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. దీనిని “డేటా తీగ తెగుతుంది” అనే సంకేతాత్మక వ్యాఖ్యతో పేర్కొంది.
ఈ ప్రాంతం కేవలం ఇంధన రవాణాకు మాత్రమే కాకుండా డిజిటల్ మౌలిక సదుపాయాలకు కూడా అత్యంత కీలకమని కథనం చెబుతోంది. బ్యాంకింగ్, క్లౌడ్ సర్వీసులు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ఆధారమైన ఫాల్కన్, ఏఏఈ-1, టీజీఎన్-గల్ఫ్ వంటి కేబుల్ నెట్‌వర్క్‌లు ఇదే మార్గంలో ఉన్నాయి.
ఈ కేబుళ్లు సున్నితమైన ప్రాంతంలో ఉండటంతో చిన్న నష్టం కూడా పెద్ద ఆర్థిక, కమ్యూనికేషన్ సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
గతంలో కూడా ఎర్ర సముద్ర ప్రాంతంలో కేబుళ్లకు నష్టం జరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటి మరమ్మతులకు నెలల సమయం పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాంతంలో డ్రోన్ దాడులు, సముద్ర మార్గాల్లో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సముద్రగర్భ కేబుళ్లు లక్ష్యంగా మారితే గ్లోబల్ ఇంటర్నెట్, క్లౌడ్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















