ఇరాన్-అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఒక కీలక ఒప్పందం రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇరాన్ పలు కీలక షరతులను ముందుంచింది. ముఖ్యంగా అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయాలని, అందులో సగభాగాన్ని చర్చలు ప్రారంభమయ్యే ముందే అందించాలని డిమాండ్ చేసింది.
ఒప్పందం ప్రకారం లెబనాన్ సహా ఇరాన్ మిత్రదేశాలపై జరుగుతున్న యుద్ధ చర్యలను వెంటనే నిలిపివేయాలని, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరింది.
అమెరికా విధించిన చమురు, పెట్రోకెమికల్ ఆంక్షలను పూర్తిగా తొలగించడంతో పాటు, ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా మరియు దాని మిత్రదేశాలు కలిసి 300 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి ప్రణాళికను సమర్పించాలని షరతు పెట్టింది. అణు కార్యక్రమాలకు సంబంధించి 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి ఆంక్షల తొలగింపు, అంతర్జాతీయ తీర్మానాల ఉపసంహరణపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
అలాగే అణ్వాయుధాల తయారీకి దూరంగా ఉంటామని ఎన్‌పీటీ ఒప్పందం ప్రకారం మరోసారి హామీ ఇవ్వడానికి సిద్ధమని ఇరాన్ తెలిపింది. ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం పొందాలని ప్రతిపాదించింది.
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















