ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన మ్యూజికల్ డ్రామా వెబ్‌సిరీస్ ‘జగమే సంగీతం’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘జగమే సంగీతం’ అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
కర్ణాటక సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు శాస్త్రి గారి వారసత్వాన్ని కొనసాగించే బాలు అనే యువకుడి చుట్టూ కథ సాగుతుంది. తన తాత నుంచి వచ్చిన సంగీత వారసత్వాన్ని కాపాడుకోవడానికి బాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఆ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే ప్రధాన కథాంశంగా తెలుస్తోంది.
ఇదే సమయంలో పాప్ స్టార్డమ్ ప్రపంచం నుంచి వచ్చిన ఓ గాయనితో బాలుకు ఏర్పడే పరిచయం, ఆ పరిచయం క్రమంగా ఎలాంటి బంధంగా మారింది? సంగీతం, ప్రేమ, కుటుంబ వారసత్వం, భావోద్వేగ సంఘర్షణల మధ్య వారి ప్రయాణం ఎటువైపు సాగింది? అనే అంశాలను సిరీస్‌లో చూపించనున్నారు.
సంగీతం ఈ కథలో కేవలం నేపథ్య అంశంగా కాకుండా.. పాత్రల మధ్య చెప్పలేని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం వంటి భావాలను వ్యక్తపరిచే భావోద్వేగ భాషగా ఉంటుందని నిర్మాత సుస్మిత కొణిదెల తెలిపారు. ఈ సిరీస్‌లో సుమన్, సిజ్జు మేనన్, షఫీ, ఝాన్సీ, రఘుబాబు, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, రూపలక్ష్మి తదితరులు కూడా నటించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















