రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ నెల 21న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సినిమాలో తాను కావేరి అనే సాధారణ గృహిణి పాత్రలో కనిపించనున్నట్లు ఆమె తెలిపారు. తాగుబోతు భర్త, అల్లరి కూతురే కావేరి ప్రపంచమని, ఇద్దరినీ సమన్వయం చేసుకుంటూ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునే మహిళగా తన పాత్ర ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు తాను చేయని తరహా పాత్ర కావడంతో ఇది తనకు కొత్త అనుభవమని పేర్కొన్నారు. నిజ జీవితంలో ఇలాంటి మహిళలను చూస్తుంటామని, అందుకే కావేరి పాత్ర ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతుందని అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ కథలు, పాత్రలు చాలా లోతుగా ఉంటాయని ప్రియా భవానీ చెప్పారు. తాను కథ విన్నప్పుడే తన పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ఎంతగానో నచ్చిందన్నారు. ముఖ్యంగా సినిమాలోని తండ్రీకూతుళ్ల అనుబంధం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆ పాత్రలు గుర్తుండిపోతాయని చెప్పారు.
రవితేజతో కలిసి పనిచేయడంపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ ఎనర్జీ అద్భుతంగా ఉంటుందని, దాన్ని మ్యాచ్ చేయడం అంత సులభం కాదన్నారు. అయితే ‘ఇరుముడి’లో ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు తనకు కొత్త రవితేజ కనిపించారని చెప్పారు. సినిమాలో ఆయన తన కూతురిని ప్రేమతో, బాధ్యతతో పెంచే తండ్రిగా కనిపిస్తారని తెలిపారు.
కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం పాత్రలోని లోతు, కథలో దానికి ఉన్న ప్రాధాన్యతను చూసే సినిమాలు ఎంపిక చేసుకుంటున్నానని ప్రియా భవానీ చెప్పారు. తన పదేళ్ల సినీ ప్రయాణం ఓ వ్యక్తిగా, నటిగా ఎంతో పరిణతిని తీసుకొచ్చిందన్నారు.
ఇక ‘ఇరుముడి’లో పల్లెటూరి తెలుగు యాసను పలకడం తనకు సవాల్‌గా అనిపించిందని తెలిపారు. నిజ జీవితంలో తాను కావేరి పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటానని, నటిగా ఇలాంటి విభిన్న పాత్రలు చేయడం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
సినిమాలో పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకోవాల్సిన అవసరాన్ని కూడా చూపించామని ఆమె తెలిపారు. ఇంట్లో పిల్లలకు అలాంటి స్వేచ్ఛా వాతావరణం కల్పించాలని ఈ చిత్రం సందేశం ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాను ‘దూత 2’ సిరీస్‌లో నటిస్తున్నానని, తొలి భాగం కంటే రెండో భాగం మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుందని తెలిపారు. అలాగే ‘డిమాంటి కాలనీ 3’ కూడా విడుదలకు సిద్ధమవుతోందని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















