కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకముందే ఈ చిత్రానికి సంబంధించిన సుమారు 5 నిమిషాల కీలక సన్నివేశం, ఒక పాట ఆన్‌లైన్‌లో లీక్ కావడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఇవి వేగంగా వైరల్ అవుతుండటంతో చిత్రబృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణ సంస్థ తరఫున విడుదలైన ప్రకటనలో, సినిమా కంటెంట్‌ను అనుమతి లేకుండా షేర్ చేయడం చట్టపరంగా నేరమని స్పష్టం చేసింది. లీక్‌కు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే కొందరికి లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. పైరసీని అరికట్టేందుకు సైబర్ క్రైమ్ విభాగంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఇక విడుదల విషయానికి వస్తే, జనవరిలో థియేటర్లలోకి రావాల్సిన ‘జన నాయగన్’ చివరి నిమిషంలో వాయిదా పడింది. సెన్సార్ క్లియరెన్స్ ఆలస్యం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. చట్టపరమైన చిక్కుల కారణంగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ నిలిచిపోయింది.ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని సూచించింది. అనంతరం జరిగిన సుదీర్ఘ వాదనలలో, సినిమాలో విదేశీ శక్తుల సహకారంతో దేశంలో మతకల్లోలం సృష్టించే అంశాలు ఉన్నాయని కోర్టు ప్రస్తావించింది.దీంతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి సినిమా పంపించాలని నిర్ణయించారు. సమీక్ష కమిటీ సభ్యుడి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీని మళ్లీ రివ్యూ కమిటీకి పంపింది. అయితే అక్కడినుంచి ఇప్పటివరకూ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు.ఇటు లీక్ వివాదం, అటు సెన్సార్ సమస్యలు కలిసి ‘జన నాయగన్’ విడుదలను మరింత సంక్లిష్టంగా మార్చాయి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















