Justice Lavu Nageswara Raoకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని చారిత్రక న్యాయ సంస్థ Inner Temple గౌరవ బెంచర్‌గా ఆయన ఎంపికయ్యారు.ఈ పదవికి ఎంపికైన రెండో భారతీయుడిగా జస్టిస్ లావు నాగేశ్వరరావు నిలిచారు. అంతకుముందు 2023లో Justice Prateek Jalan ఈ గౌరవాన్ని అందుకున్నారు.
న్యాయరంగానికి విశిష్ట సేవలందించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయకోవిదులు, రాజనీతిజ్ఞులను ప్రస్తుత బెంచర్లు ఈ గౌరవ పదవికి ఎంపిక చేస్తారు. ఈ అరుదైన అవకాశం ఇప్పుడు తెలుగువారైన జస్టిస్ నాగేశ్వరరావుకు దక్కడం విశేషంగా మారింది.గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో బీకాం, బీఎల్ పూర్తి చేసిన ఆయన.. గుంటూరు జిల్లా, ఏపీ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2016 నుంచి 2022 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.
ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్ బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, అక్కడి విద్యా కార్యక్రమాలకు సహకరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు.1388 నుంచి కొనసాగుతున్న ఇన్నర్ టెంపుల్ ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక న్యాయ వ్యవస్థల్లో ఒకటి. ఇంగ్లండ్, వేల్స్‌లలో బారిస్టర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే ఇన్స్ ఆఫ్ కోర్ట్‌గా పిలిచే నాలుగు సంస్థల్లో సభ్యత్వం తప్పనిసరి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















