కడప నగరంలోని విజయదుర్గాదేవి కాలనీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. బహుళ అంతస్తుల భవనంలోని ఓ ఫ్లాట్‌లోకి గుర్తుతెలియని వ్యక్తి తాళాలు పగులగొట్టి ప్రవేశించి, బీరువాలో ఉన్న సుమారు వంద తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదును అపహరించాడు. చోరీ అనంతరం ఇంటికి కొత్త తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఫ్లాట్‌లో నివసించే వృద్ధ దంపతుల్లో భర్త ఇటీవల మృతి చెందడంతో.. తల్లి లీలావతిని కుమారులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దీంతో సుమారు రెండు నెలలుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో ఎవరూ ఉండటం లేదని తెలుసుకున్న దొంగ పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పనిమనిషి ఇంటికి వెళ్లిన సమయంలో కొత్త తాళాలు కనిపించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
పట్టపగలు చోరీ జరగడం, దొంగ ఇంటికి కొత్త తాళాలు వేయడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి తెలిసిన వ్యక్తులు లేదా బంధువుల ప్రమేయం ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల వ్యవహారంలో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా విచారణ కొనసాగుతోంది. సీసీ ఫుటేజీలో కనిపించిన యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















