దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం మరోసారి భారీ అభివృద్ధి పనులకు వేదిక కానుంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.198 కోట్లతో ఆలయ సముదాయాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయాలు, మండపాలు, ప్రాకారాలు, రాజగోపురాల స్థానంలో శాశ్వత రాతి కట్టడాలను నిర్మించేందుకు దేవాదాయ శాఖ కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం.
గతంలో 1982లో నిర్మించిన ఆలయాలు, ప్రాకారాలు కాలక్రమేణా మరమ్మతులకు లోనవ్వడంతో వాటి స్థానంలో ఆధునిక సౌకర్యాలతో పాటు సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించే రాతి నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు శృంగేరి పీఠం అనుమతులు కూడా లభించినట్లు తెలుస్తోంది.
యముడు, శివుడు కొలువైన ప్రధాన గర్భాలయం, శుభానంద ఆలయం, సరస్వతీ ఆలయం, అభిషేక మండపం, అనివెట్టి మండపం, కల్యాణ మండపాలు, ప్రాకారాలు, రాజగోపురాలు తొలగింపు జాబితాలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నప్పటికీ, వేగవంతమైన పనుల కారణంగా నిర్మాణాల నాణ్యతపై భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాల సమయంలో భక్తుల దర్శన ఏర్పాట్లపై కూడా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HyderabadNews India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















