కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మియాపూర్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రస్తుతం “ఆర్‌ఆర్ ట్యాక్స్” పేరుతో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కొందరు ఐఏఎస్ అధికారులు కూడా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, పెట్టుబడులు తగ్గిపోయాయని అన్నారు.
మెట్రో ప్రాజెక్ట్ అంశంలో 220 ఎకరాల భూముల వ్యవహారం, అలాగే రూ.14 వేల కోట్ల ఎల్ అండ్ టీ అప్పుల భారం ప్రజలపై మోపారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిసి దిల్లీ కేంద్రంగా మెట్రో పొడిగింపు విషయంలో రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మహిళలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, నెలకు రూ.2,500 చొప్పున ఇప్పటివరకు చెల్లించాల్సిన బకాయిలు రూ.75,000 తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే మూడేళ్ల చెల్లింపులతో కలిపి రూ.1.50 లక్షలు చెల్లిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు ముఖ్యమంత్రి సిద్ధమా అని ప్రశ్నించారు.
‘ఎస్‌ఐఆర్’ అంశంపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయి నుంచి ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















