Tirupati లోని Sri Venkateswara Veterinary University లో సోమవారం ఉదయం చిరుత కలకలం సృష్టించింది. క్లినికల్ విభాగంలోని గదుల తలుపులు తెరవగానే ఏడాదికి పైగా వయసున్న చిరుత ప్రత్యక్షం కావడంతో అక్కడి అటెండర్ భయంతో పరుగులు తీశారు.
సిబ్బంది అక్కడికి చేరుకోగానే చిరుత వారిపై దాడికి యత్నించింది. అనంతరం భవనంలోని మరుగుదొడ్లోకి వెళ్లి దాక్కుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే భవనాన్ని మూసివేసి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దింపారు.
Hanuman Rescue Team వలలు, బోను, మత్తుమందు పరికరాలతో అక్కడికి చేరుకుని సుమారు మూడు గంటల పాటు శ్రమించి చిరుతను సురక్షితంగా బంధించింది. ప్రస్తుతం చిరుత ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
కొన్ని రోజుల పాటు ఎస్వీ జూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అనంతరం Seshachalam Hills అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు వెల్లడించారు. భవనం వెనుక ఉన్న చెట్టు ద్వారా చిరుత లోపలికి ప్రవేశించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















