కింగ్ కోబ్రా లాంటి అత్యంత విషపూరితమైన పాము కనిపిస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ చిన్నారి మాత్రం దాని ముందు ఏమాత్రం భయపడకుండా డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాలిక కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లి దానిని కవ్విస్తూ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఓ సందర్భంలో బాలిక పామును తట్టి లేపడంతో అది ఒక్కసారిగా పడగ విప్పి దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో చిన్నారి వెంటనే వెనక్కి తగ్గింది. అయితే కొద్దిసేపటికే మళ్లీ పాము ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది.
అంతటితో ఆగకుండా కింగ్ కోబ్రా తోకను పట్టుకుని పైకి ఎత్తేందుకు కూడా బాలిక ప్రయత్నించింది. సాధారణంగా మనుషుల కదలికలకు అప్రమత్తమై దూకుడుగా స్పందించే కింగ్ కోబ్రా.. బాలిక ఇంతగా కవ్వించినా దాడి చేయకపోవడం వీడియో చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇలాంటి చర్యలు ఏమాత్రం అనుకరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాము కావడంతో.. దానికి దగ్గరగా వెళ్లడం, తాకడం, కవ్వించడం లేదా తోక పట్టుకోవడం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను చూసి ఇలాంటి సాహసాలను ఎవరూ ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















