కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం, దేశవ్యాప్తంగా LPG సిలిండర్ల సరఫరా ప్రస్తుత పరిస్థితుల్లో సజావుగా కొనసాగుతోంది. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 5 కిలోల FTL సిలిండర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రజలు తమ గుర్తింపు కార్డులు చూపించి, నివాస ధ్రువీకరణ పత్రాల అవసరం లేకుండా సులభంగా సిలిండర్లు పొందవచ్చు.
గత నెల 23 నుంచి ఇప్పటివరకూ 6.6 లక్షలకు పైగా FTL సిలిండర్లు ప్రజలకు విక్రయించబడ్డాయి. ఒక్క శనివారం(4వ తేదీ) రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయి. ఇందులో 95% సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్ అయ్యాయి.అక్రమంగా నిల్వ ఉంచిన LPG సిలిండర్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 50,000 పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు, 1,400 పైగా డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు మరియు 36 డీలర్‌షిప్‌లను సస్పెండ్ చేశారు.
ప్రభుత్వం గృహ వినియోగం, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు LPG, PNG సరఫరాకు ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే, దేశంలోని చమురు రిఫైనరీలు తగినన్ని క్రూడ్ నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో కూడా సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి.ప్రజలు భయాందోళనలో మునిగిపోకుండా, అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా, అధికారిక సమాచారం మీద ఆధారపడాలని కేంద్రం సూచిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















