వైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఫ్లెక్సీల్లో ‘‘మహా పాపం నిజం’’ అంటూ పేర్కొంటూ, భారీ మొత్తంలో కల్తీ నెయ్యి వినియోగించి కోట్ల లడ్డూలు తయారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయన్న వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం జగన్‌తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్‌ల ఫొటోలు ఉంచడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిర్ధారించిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ అంశంపై రాజకీయ, ప్రజా వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















