టెక్ దిగ్గజం Apple Inc. తన నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. 15 ఏళ్లుగా సీఈవోగా ఉన్న Tim Cook పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించగా, ఆయన స్థానంలో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టర్నెస్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.టిమ్ కుక్ ఇకపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. 2011లో ఆయన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాపిల్ మార్కెట్ విలువ 20 రెట్లు పెరిగి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
కొత్త సీఈవో జాన్ టర్నెస్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో కీలక ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా మ్యాక్, ఐపాడ్, ఎయిర్‌పాడ్ డిజైన్ మరియు డెవలప్‌మెంట్‌లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఆయన నేతృత్వంలో మ్యాక్ ప్రో వంటి ఉత్పత్తులు కంపెనీకి మంచి విజయాన్ని తీసుకొచ్చాయి.
ఈ నాయకత్వ మార్పుతో యాపిల్ హార్డ్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మరింత దృష్టి పెట్టనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిప్ దిగ్గజం NVIDIA Corporationతో పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుంది. ఇటీవల మార్కెట్ విలువ పరంగా కూడా ఎన్విడియా యాపిల్‌ను అధిగమించిన విషయం తెలిసిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















