చిన్నారులను సామాజిక మాధ్యమాల ప్రభావం నుంచి రక్షించేందుకు మలేసియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు సోషల్ మీడియా ఖాతాలు తెరవడం ఇకపై అనుమతించబడదు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ వంటి ప్రముఖ వేదికలు వినియోగదారుల వయస్సును నిర్ధారించే వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న చిన్నారుల ఖాతాలను వచ్చే ఆరు నెలల్లో దశలవారీగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మార్పుల నేపథ్యంలో చిన్నారులు తమ ఖాతాల్లోని డేటాను ఒక నెల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కమ్యూనికేషన్ అండ్ మల్టీమీడియా కమిషన్ ప్రకటించింది.
నిబంధనలు ఉల్లంఘించినందుకు చిన్నారుల తల్లిదండ్రులపై శిక్షలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నియమాలను అమలు చేయడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు 10 మిలియన్ రింగిట్ (సుమారు రూ.24 కోట్లు) వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
ఈ నిర్ణయం చిన్నారుల ఆన్‌లైన్ భద్రతను పెంచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















