దాదాపు రెండు వారాల క్రితం ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ని స్థాపించిన అభిజీత్ దీప్కే ఈ నెల 6న భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. తనపై అరెస్టు చేసి జైలుకు పంపించే అవకాశాలు ఉన్నప్పటికీ, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నారు.
నీట్ ప్రశ్నపత్రం సహా వివిధ పరీక్షల నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లక్ష్యంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తానని ఆయన తెలిపారు. తన మద్దతుదారులతో కలిసి శాంతియుత నిరసన చేపడతానని చెప్పారు.
“ఇప్పటికీ భారత్ ప్రజాస్వామ్య దేశమని నమ్ముతున్నా. శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నా. జైలు భయంతో జీవించాల్సిన అవసరం లేదు. ఈ దేశం ఏ ఒక్క పార్టీకి చెందింది కాదు, మనందరిదీ,” అని ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తూ సౌకర్యవంతమైన జీవితం గడపవచ్చని, అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదిలి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. “ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారని ఎంతకాలం ఎదురుచూస్తాం? రాజ్యాంగాన్ని విశ్వసించే, శాంతిని కోరుకునే వారంతా నాతో కలిసి భవిష్యత్తును కాపాడాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















