1993లో వివాహం తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో నెలకు రూ.2 వేల జీతం వచ్చేదని ఓ చందాదారు తెలిపారు. ఆ సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ మార్గదర్శిలో చిట్టీ ప్రారంభించినట్లు చెప్పారు. చిట్టీ పూర్తయిన తర్వాత వచ్చిన మొత్తాన్ని అదే సంస్థలో డిపాజిట్ చేసి, దానిపై వచ్చిన ఆదాయంతో మరో చిట్టీ కొనసాగించేవాడినని వివరించారు.
ఇలా చిన్న మొత్తంతో ప్రారంభమైన పొదుపు ప్రయాణం క్రమంగా కుటుంబ ఆర్థిక ప్రణాళికలో కీలకంగా మారిందని ఆయన తెలిపారు. 33 ఏళ్లుగా మార్గదర్శితో తన అనుబంధం కొనసాగుతోందని, మధ్యలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తన విశ్వాసం మాత్రం సడలలేదని చెప్పారు.
చిట్టీల ద్వారా వచ్చిన మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని మూడు ప్లాట్లు కొనుగోలు చేయగలిగానని, పిల్లల వివాహాలు కూడా నిర్వహించగలిగానని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబ ఆర్థిక అవసరాల్లో మార్గదర్శి కీలకంగా నిలిచిందని తెలిపారు.
తన మూడు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో చిట్టీ సంస్థలు ప్రారంభమై తర్వాత కనుమరుగయ్యాయని, అయితే మార్గదర్శిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అనుమానం కలగలేదని అన్నారు. సంస్థపై ఉన్న విశ్వాసమే ఇంతకాలం తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి కారణమైందని పేర్కొన్నారు.
మార్గదర్శిపై వచ్చిన ఆరోపణలు, వివాదాల సమయంలోనూ తన నమ్మకం చెక్కుచెదరలేదని తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టులో మార్గదర్శికి అనుకూలంగా వచ్చిన తీర్పుతో తమ కుటుంబం ఎంతో సంతోషించిందని, దీనిని తమ ఇంటి విజయంగా భావిస్తున్నామని అన్నారు.
వ్యక్తిగత కక్షలు, స్వార్థ ప్రయోజనాలతో చేసిన ఆరోపణలు చివరకు నిలబడలేదని తేలడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మార్గదర్శి ఇదే విశ్వాసంతో ముందుకు సాగాలని, మరో 50 ఏళ్లపాటు సంస్థ తమలాంటి చందాదారులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















