మయన్మార్ ఈశాన్య ప్రాంతంలోని నామ్కాం పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనలో 46 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చైనా సరిహద్దుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌంగ్టప్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
గనుల తవ్వకాలకు ఉపయోగించే పేలుడు పదార్థాలు నిల్వ చేసిన భవనంలో ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రాంతం మయన్మార్ ప్రభుత్వంతో తరచూ ఘర్షణలకు దిగే ‘టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ నియంత్రణలో ఉండటం గమనార్హం.
సహాయక బృందాలు సాయంత్రానికి మృతదేహాలను స్వాధీనం చేసుకుని అంత్యక్రియలకు తరలించాయి. ఘటనలో గాయపడిన 74 మందిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రతతో పరిసర ప్రాంతాల్లోని సుమారు 100 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
ప్రాథమిక అంచనాల ప్రకారం గనుల్లో ఉపయోగించే గెలిగ్నైట్ పేలుడు పదార్థాన్ని అజాగ్రత్తగా నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుల సంఖ్య 55 వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఘటన సమయంలో మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హయింగ్ భారత్‌లో పర్యటనలో ఉన్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















