పరీక్షల సమయం వచ్చేసింది. ఈ సమయంలో పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చదువుతో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో మెదడుకు శక్తినిచ్చే ఆహారం చాలా అవసరం.
ఒమేగా‑3 కొవ్వు ఆమ్లాలు
మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇవి చాలా అవసరం. జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సాల్మన్, ట్యూనా చేపలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజల్లో ఇవి లభిస్తాయి.
ఓట్స్
ఓట్స్ శరీరానికి నిరంతర శక్తిని అందిస్తాయి. నెమ్మదిగా విడుదలయ్యే కార్బోహైడ్రేట్లు ఉండటంతో ఎక్కువసేపు మెదడుకు ఇంధనం అందుతుంది.
విటమిన్ B, E, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. పరీక్షల సమయంలో మంచి అల్పాహారం.
తృణ ధాన్యాలు / చిరుధాన్యాలు
పీచు పదార్థం అధికంగా ఉండే ఈ ధాన్యాలు రోజంతా స్థిరమైన శక్తిని ఇస్తాయి.
రాగి, జొన్న, సజ్జలు, దంపుడు బియ్యం, హోల్ వీట్ లాంటివి మెదడు పనితీరుకు మేలు చేస్తాయి.
గుడ్డు
పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి గుడ్డు చాలా ఉపయోగకరం.
ప్రొటీన్ అధికంగా ఉండటంతో పాటు, పచ్చసొనలోని కోలిన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్, విటమిన్ A, D, E, B12 కూడా అందుతాయి.
డ్రై ఫ్రూట్స్ & నట్స్
బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు లాంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకుంటే మెదడుకు మంచి పోషణ లభిస్తుంది.
పరీక్షల సమయంలో పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్, తీపి పదార్థాలు తీసుకోకుండా, సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకుంటే చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















