సామాజిక మాధ్యమాల్లో ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల గురించి వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు లేదా ఆధారాలు లేని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఫుడ్ కంపెనీలు ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీల ద్వారా తమ ఉత్పత్తులను పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ‘ఈ ఉత్పత్తి చాలా మంచిది’, ‘ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం’ వంటి వ్యాఖ్యలతో ప్రమోషన్లు జరుగుతున్న నేపథ్యంలో FSSAI ఈ అంశంపై దృష్టి సారించింది.
ఆహార ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ప్రచారం చేసే ముందు తాము చెబుతున్న విషయాలు వాస్తవమైనవేనా, వాటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా, నిరూపించగలమా, చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే అంశాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని FSSAI సూచించింది.
ముఖ్యంగా శాస్త్రీయ ఆధారాలు లేకుండా ‘రోగనిరోధక శక్తిని పెంచుతుంది’, ‘సంపూర్ణ పోషకాహారం అందిస్తుంది’ వంటి ఆరోగ్య సంబంధిత క్లెయిమ్స్ చేయవద్దని హెచ్చరించింది. ప్రచారం చేయడంతో పాటు దానికి సంబంధించిన బాధ్యతను కూడా ఇన్‌ఫ్లూయెన్సర్లు తీసుకోవాలని సూచించింది.
FSSAI నిబంధనలను ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006, అలాగే అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్ నిబంధనలు, 2018 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం మాత్రమే కాకుండా, అలాంటి ప్రకటనలను సెలబ్రిటీలు లేదా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎండార్స్ చేయడం కూడా నిబంధనల పరిధిలోకి వస్తుందని FSSAI స్పష్టం చేసింది.
ఇటీవల ఉత్పత్తులను ‘100 శాతం స్వచ్ఛమైనవి’గా ప్రచారం చేసిన అంశంలో డాబర్ ఇండియా ఉత్పత్తులపై FSSAI చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తుల ప్రచారంలో ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు మరింత అప్రమత్తంగా ఉండాలని FSSAI సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















