కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులపై ప్రహరీ గోడ కూలడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
శెట్టూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లికి చెందిన హర్షవర్ధన్‌తేజ (12), కుందుర్పి మండలం బసాపురానికి చెందిన అక్షయ్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని మూతబడిన ఓ ప్రైవేట్ కళాశాల వద్దకు వెళ్లారు. తిరిగి వసతి గృహానికి వస్తుండగా బలమైన గాలులు వీయడంతో కళాశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి ఇద్దరు విద్యార్థులపై పడింది.
ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వసతి గృహ సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా హర్షవర్ధన్‌తేజ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన అక్షయ్‌కు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి రూ.50 వేల నగదు సాయం అందించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ప్రహరీ గోడలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో వసతి గృహాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















