నాగుల పంచమిని పురస్కరించుకొని సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగోబాను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. భక్తులు గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు.
మెస్రం వంశీయులు సంప్రదాయంగా జొన్న గటకను ప్రసాదంగా తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు పరిసరాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు.
జాతరలో రంగుల రాట్నాలు, ఇతర వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యువత రంగుల రాట్నాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మెస్రం యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, మెస్రం వంశ ఉద్యోగులు శేఖర్‌బాబు, మనోహర్, సర్పంచులు తుకారాం, రాజేశ్వర్, లాల్‌షావ్, సీఐ మడావి ప్రసాద్, ఎస్సై సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















