ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకోగా.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సమయంలో భారత్, చైనా సహా పలు దేశాలు సహాయం చేసేందుకు ముందుకొచ్చినా.. నేపాల్ మాత్రం విదేశీ రెస్క్యూ బృందాలను ప్రస్తుతం అనుమతించడం లేదని స్పష్టం చేసింది.
తమ భద్రతా బలగాలు సహాయక చర్యలను సమర్థంగా నిర్వహించగలవని నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది. గాలింపు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం విదేశీ బృందాల అవసరం లేదని వెల్లడించింది. భారత్, చైనా, అమెరికా, యూకే, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది.
విదేశీ సహాయాన్ని తిరస్కరించడానికి ప్రధాన కారణం 2015లో వచ్చిన భారీ భూకంపమేనని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు పెద్ద సంఖ్యలో నేపాల్‌కు చేరుకున్నాయి. అయితే వివిధ దేశాల బృందాల మధ్య సమన్వయం లోపించడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. ఆ అనుభవం దృష్ట్యా ప్రస్తుత విపత్తులో విదేశీ బృందాలను ఆహ్వానించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రెస్క్యూ బృందాలను వద్దంటున్న నేపాల్.. ఆర్థిక సహాయాన్ని మాత్రం స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా, యూకే, ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ తదితర సంస్థలు ఆర్థిక సాయం ప్రకటించాయి. అయితే ఆ నిధులు నేరుగా ప్రధాని సహాయ నిధికి చేరేలా చర్యలు తీసుకోవాలని నేపాల్ ప్రభుత్వం కోరింది.వరదల కారణంగా ఇప్పటివరకు వందల మంది మరణించగా.. భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. భారత్‌కు చెందిన పలువురి ఆచూకీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















