పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఈ విషయంలో తమ మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
జెరూసలెంలో నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడిన నెతన్యాహు, “ట్రంప్ నేను కోరుకున్నవన్నీ చేయరు. అలాగే నేను ఆయన కోరుకున్నవన్నీ చేయను. మేము స్వతంత్ర దేశాల నాయకులం. కొన్ని విషయాల్లో అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. మా మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదు. అయినప్పటికీ మా దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాము” అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భద్రత, జాతీయ ప్రయోజనాలు తమకు అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు.
అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా లేదా జరగకపోయినా టెహ్రాన్‌కు అణ్వాయుధం దక్కనివ్వబోమని నెతన్యాహు కఠినంగా హెచ్చరించారు. తాను ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పొందే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి దౌత్య పరిణామాలు వచ్చినా తన నిర్ణయం మారదని కూడా తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలిలో రక్షణ వ్యవహారాల ఉప కార్యదర్శిగా ఉన్న ఘాదిర్ నెజామీపౌర్‌తో భారత జాతీయ భద్రత సలహాదారు అజీత్ డోభాల్ దిల్లీలో సోమవారం భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. బ్రిక్స్ ఎన్‌ఎస్‌ఏల సమావేశంలో పాల్గొనేందుకు నెజామీపౌర్ భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే యూరియా, డీఏపీ, సల్ఫర్ ఎరువులతో కూడిన నాలుగు రవాణా నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి భారత్‌లోని కృష్ణపట్నం, కాకినాడ, పారాదీప్, ముంద్రా రేవుల వైపు ప్రయాణిస్తున్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















