పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం కొనసాగుతుండటంతో పాపికొండల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెం గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారులు రేడియో కాలర్ సాంకేతికతతో పాటు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్తోంది, ఏ ప్రాంతంలో సంచరిస్తోందనే విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.
పులి సంచారం నేపథ్యంలో దేవీపట్నం నుంచి గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో పాపికొండల అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా వీకెండ్‌లలో సందడిగా ఉండే ప్రాంతాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.
ఇక పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. హనుమాన్ టీంలు, వన్యప్రాణి నిపుణులు, ప్రత్యేక సిబ్బంది అటవీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కాపుకాసినా పులి చిక్కకపోవడంతో ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు.
దట్టమైన అటవీ ప్రాంతం, కొండలు, లోయలు అధికంగా ఉండటంతో పులిని గుర్తించి బంధించడం సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















