కొల్లూరులో శుక్రవారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన బాలికను కొల్లూరు గాంధీనగర్‌కు చెందిన నండూరు జయరావు ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఈ వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జయరావు కుటుంబ సభ్యులను విచారణకు పిలిపించారు. అనంతరం జయరావు, బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది.
ఈ క్రమంలో జయరావుపై పలు సెక్షన్ల కింద పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం అందడంతో అతని తల్లిదండ్రులు ఎన్. కృష్ణ, రమణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆవేదనలో ఉన్న వారు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ఘటనకు ముందు సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని బాధితులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















