ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపడుతున్న పనుల పురోగతిని అధికారులు పవన్‌కు వివరించారు.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి ఘాట్ల వద్ద చేపడుతున్న నిర్మాణాలు, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ సదుపాయాలపై పవన్ కల్యాణ్‌కు వివరించారు. అనంతరం పుష్కర్‌ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ గోదావరి పరివాహక ప్రాంత పరిస్థితులను పవన్ పరిశీలించారు.
అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిని మంత్రి కందుల దుర్గేశ్ పవన్‌కు వివరించారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఘాట్ల వెంట పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి శుద్ధి వ్యవస్థల ఏర్పాటు వంటి అంశాలపై పవన్ అధికారులతో చర్చించారు.
పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశముండటంతో భద్రత, పారిశుధ్యం, తాగునీరు, రవాణా వంటి అన్ని అంశాల్లో సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. గోదావరి పవిత్రతను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















