మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు కలెక్టరేట్ గేటు వైపు దూసుకెళ్లారు. లోనికి ప్రవేశించేందుకు గేటును తోసుకుంటూ ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహబూబాబాద్ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి నేతృత్వంలో పోలీసులు విద్యార్థులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది.
విద్యార్థులను వెనక్కి పంపే క్రమంలో సీఐ కొందరి గొంతు పట్టుకొని నెట్టిన ఘటనపై ఆందోళనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు మరింతగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు పోలీసు బలగాలను అక్కడికి రప్పించారు.
అదనపు పోలీసులు చేరుకున్న అనంతరం విద్యార్థులను ఒక్కొక్కరినీ కలెక్టరేట్ ప్రాంగణం నుంచి బయటకు తీసుకొచ్చి గేటును మూసివేశారు. దీంతో విద్యార్థులు గేటు బయటే సుమారు రెండు గంటలపాటు బైఠాయించి తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశానికి అవకాశం కల్పించే ఈసెట్ విధానాన్ని రద్దు చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని కోరారు. జీవో 97ను రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















