ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 39 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ బస్సు, కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్దకు చేరుకున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. పరిస్థితిని గమనించిన ఆయన బస్సును రోడ్డుపక్కన ఆపి, ప్రయాణికులను దిగమని సూచించాడు. దీంతో ప్రయాణికులంతా భయాందోళనల మధ్య బస్సు నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు.
ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు నుంచి ఎగసిపడిన భారీ పొగలు, మంటలతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రాథమికంగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం స్పష్టమైన కారణాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.ఈ ఘటనతో ప్రయాణికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, వాహనాల సాంకేతిక తనిఖీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















