అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో పాటు మరో దేశం నుంచి తనకు పౌరసత్వం ఇవ్వాలని ఆఫర్లు వచ్చాయని వెల్లడించాడు. అయితే, తాను మాత్రం ఎప్పటికీ అఫ్గానిస్థాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.
2023 ఐపీఎల్ సీజన్ సమయంలో తనకు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయని రషీద్ గుర్తు చేసుకున్నాడు. ఓ ఉన్నతస్థాయి వ్యక్తి తనను కలిసి భారత్‌లో స్థిరపడాలని సూచించారని తెలిపాడు.
“అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు బాగాలేవని, భారత్‌కు వచ్చి అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పారు. ఇక్కడే ఉండి క్రికెట్ ఆడమని చెప్పారు. కానీ నేను నా దేశం తరఫునే ఆడతానని స్పష్టంగా చెప్పాను” అని రషీద్ పేర్కొన్నాడు.అలాగే ఆస్ట్రేలియా నుంచి కూడా సిటిజన్‌షిప్ ఆఫర్ వచ్చినట్లు ఆయన వెల్లడించాడు. కానీ ఏ దేశం నుంచైనా ఆఫర్ వచ్చినా, తన నిర్ణయం మాత్రం మారదని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు. తన దేశం కోసం ఆడటమే తన గౌరవమని ఆయన పేర్కొన్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















