చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్ ధరలను పెంచింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు సవరించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
మెమరీ చిప్‌ల ఖర్చులు, ప్రాసెసర్ ధరలు, మొత్తం తయారీ వ్యయాలు పెరగడమే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణమని సంస్థ తెలిపింది. ఈ ధరల సవరణకు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్‌లో పంచుకున్నారు.
సవరించిన ధరల ప్రకారం, రియల్‌మీ 16 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1,000 పెంచగా, రియల్‌మీ 16 ప్రో+ 5G వేరియంట్ల ధరలు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి. అలాగే రియల్‌మీ 16 5G మోడల్ ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగినట్లు సమాచారం. దీంతో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ధరల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















