ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, సంస్థ అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ, ఈ ఏడాది మొత్తం 2,500 ఎలక్ట్రిక్ మరియు సీఎన్జీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ఈ ఏడాది చివరి నాటికి రోడ్లపైకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
కాలం చెల్లిన బస్సులను దశలవారీగా తొలగించి, కొత్త బస్సులతో భర్తీ చేస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కాలుష్యాన్ని తగ్గించేలా ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సుల వినియోగాన్ని పెంచుతున్నామని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. అవసరమైన మేరకు డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈహెచ్ఎస్ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. అలాగే ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ చర్యలతో ఆర్టీసీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని, సంస్థను నష్టాల నుంచి లాభాల దిశగా తీసుకెళ్లడమే లక్ష్యమని ఎండీ కృష్ణబాబు స్పష్టం చేశారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















