శ్రీలంక–ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్–ఎ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్–ఎ ఒక వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్ సాయి సుదర్శన్ అజేయ శతకం (104 నాటౌట్; 184 బంతుల్లో 13 ఫోర్లు) సాధించి జట్టును ముందుకు నడిపించాడు. దేవ్‌దత్ పడిక్కల్ కూడా అద్భుతంగా ఆడుతూ 94 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు అభేద్యంగా 181 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అమన్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 288/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక–ఎ జట్టు 366 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సహన్ 127 పరుగులు (207 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులు) చేసి సెంచరీ సాధించాడు.
భారత బౌలింగ్‌లో గుర్నూర్ బ్రార్ 4 వికెట్లు, సారాంశ్ జైన్ కూడా 4 వికెట్లు తీయగా, యశ్ ఠాకూర్ 2 వికెట్లు సాధించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















