జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగం, ఇతర చట్టాల ద్వారా కల్పించిన రక్షణలు అమలవుతున్నాయా లేదా అనే అంశాన్ని ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఎస్సీల హక్కులకు భంగం కలిగినప్పుడు ఫిర్యాదులను స్వీకరించి విచారణ కూడా చేపట్టవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఎస్సీల అభివృద్ధి కార్యక్రమాలపై కమిషన్ సలహాలు, సూచనలు అందిస్తుంది. ఎస్సీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలించి రాష్ట్రపతికి నివేదికలను సమర్పిస్తుంద.
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటుకు 89వ రాజ్యాంగ సవరణ చట్టం–2003 కీలకంగా నిలిచింది. ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 338ను ఎస్సీలకు, ఆర్టికల్ 338Aను ఎస్టీలకు ప్రత్యేకంగా వర్తించేలా చేశారు. ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక రక్షణలు, సంక్షేమ కార్యక్రమాల అమలును కమిషన్ పర్యవేక్షిస్తుంది.
ఎస్టీల హక్కులు, భూమి, అటవీ హక్కులు, విద్య, ఉపాధి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించి కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్టీల ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించడం, ప్రభుత్వాలకు సూచనలు చేయడం, రాష్ట్రపతికి నివేదికలు సమర్పించడం దీని ముఖ్య విధుల్లో భాగం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















