ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సీనియర్‌ నటుడు, నిర్మాత జి.వి.నారాయణరావు కన్నుమూత

August 28, 2026
in News, Movies
0
సీనియర్‌ నటుడు, నిర్మాత జి.వి.నారాయణరావు కన్నుమూత

సీనియర్‌ నటుడు, నిర్మాత జి.వి.నారాయణరావు కన్నుమూత

Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత గుళ్లపల్లి వెంకట నారాయణరావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నటుడిగా వందకుపైగా చిత్రాలు, పలు ధారావాహికల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన.. నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు.

కృష్ణా జిల్లా కురుమద్దాలిలో జన్మించిన జి.వి.నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. ఆయన తండ్రి సినీ పంపిణీదారుడు కావడంతో చిన్ననాటి నుంచే సినీ వాతావరణంతో పరిచయం ఏర్పడింది. కళలపై ఆసక్తితో భరతనాట్యం, కూచిపూడి, నటనలో శిక్షణ పొందారు. నాటక రంగంలోనూ చురుకుగా పాల్గొని ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’, ‘ప్రతాపరుద్రీయ’, ‘మంచుతెర’ వంటి నాటకాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నటనపై శిక్షణ పొందిన ఆయన.. అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌కు సహాధ్యాయి. కె.బాలచందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’తో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు అందుకున్నారు. కథానాయకుడిగా సుమారు 50 చిత్రాల్లో నటించిన అనంతరం సహాయ నటుడిగానూ కొనసాగారు.

‘ముత్యాల పల్లకి’, ‘ఒక ఊరి కథ’, ‘గుప్పెడు మనసు’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘మంచు పల్లకీ’, ‘బహుదూరపు బాటసారి’, ‘చట్టానికి కళ్ళులేవు’, ‘రాజా విక్రమార్క’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘హిట్లర్‌’, ‘సాహసం’, ‘తోలు బొమ్మలాట’, ‘స్కైలాబ్‌’ తదితర చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఆలోచన’ విడుదల కావాల్సి ఉంది.

నిర్మాతగా ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించారు. చిరంజీవితో ఉన్న సన్నిహిత అనుబంధం కారణంగా ఆయన నిర్మాణంలో చిరంజీవి నటించిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ‘యముడికి మొగుడు’ తమిళ రీమేక్‌లో రజనీకాంత్‌ నటించడం విశేషం.

జి.వి.నారాయణరావు మృతిపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని పేర్కొంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నారాయణరావుకు భార్య అనురాధ, కుమారుడు అవినాష్‌, కుమార్తె లలిత యామిని ఉన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: GV Narayana RaoGV Narayana Rao DeathGV Narayana Rao Passed AwaySenior Telugu Actorshivasakthi newsshivasakthimediatelugu actorTelugu CinemaTelugu Film IndustryTelugu Producer
ShareTweetSend
Previous Post

శ్రావణ శుక్రవారం వేళ.. ఫలాలతో కనకమహాలక్ష్మి అమ్మవారి అలంకరణ

Next Post

దినుష డిఫెన్స్‌ ముందు భారత బౌలర్లు తేలిపోయారు.. టెస్టు డ్రా

Related Posts

విశాఖలో కలకలం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక కిడ్నాప్
Crime News

విశాఖలో కలకలం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

August 28, 2026
పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు
Devotional News

పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు

August 28, 2026
గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం
Crime News

గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

August 28, 2026
కోడిపందేలకు చెక్‌.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు
India News

కోడిపందేలకు చెక్‌.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

August 28, 2026
రాఖీ కట్టే చేతులే రక్షించాయి.. తమ్ముడి కోసం కిడ్నీ దానం చేసిన అక్క
India News

రాఖీ కట్టే చేతులే రక్షించాయి.. తమ్ముడి కోసం కిడ్నీ దానం చేసిన అక్క

August 28, 2026
మరోసారి తెరపైకి దుల్కర్‌-నివిన్‌ కాంబినేషన్‌.. కొత్త సినిమాకు రంగం సిద్ధం
Movies

మరోసారి తెరపైకి దుల్కర్‌-నివిన్‌ కాంబినేషన్‌.. కొత్త సినిమాకు రంగం సిద్ధం

August 28, 2026
Next Post
దినుష డిఫెన్స్‌ ముందు భారత బౌలర్లు తేలిపోయారు.. టెస్టు డ్రా

దినుష డిఫెన్స్‌ ముందు భారత బౌలర్లు తేలిపోయారు.. టెస్టు డ్రా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 28, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 28, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
28 ఆగస్టు 2026 (శుక్రవారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 28, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు

పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు

August 28, 2026
గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

August 28, 2026
కోడిపందేలకు చెక్‌.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

కోడిపందేలకు చెక్‌.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

August 28, 2026
రాఖీ కట్టే చేతులే రక్షించాయి.. తమ్ముడి కోసం కిడ్నీ దానం చేసిన అక్క

రాఖీ కట్టే చేతులే రక్షించాయి.. తమ్ముడి కోసం కిడ్నీ దానం చేసిన అక్క

August 28, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు

పాతూరు ఆలయంలో వైభవంగా అష్టలక్ష్మీ పూజలు

August 28, 2026
గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

గోదావరి వంతెనపై చిన్నారిని వదిలి.. దంపతుల బలవన్మరణం

August 28, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.