సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూముల బదలాయింపు అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం కీలక విచారణ జరిగింది. పర్యావరణవేత్త, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన ఈ పిల్‌లో, విశాఖపట్నం గ్రామీణ మండలం అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలోని దేవస్థాన భూములను హైపర్ స్కేల్ డేటాసెంటర్ పార్క్ లిమిటెడ్‌కు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ఈ భూకేటాయింపు ప్రక్రియ పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ వాదనలు వినిపించారు. కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి కేవలం 860 మీటర్ల దూరంలోనే డేటా సెంటర్ ఏర్పాటు చేయడం పర్యావరణానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేవాదాయ చట్టంలోని సెక్షన్ 80(1)(బి)కు కూడా ఇది విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూములు బదలాయిస్తున్నారన్నది అపోహ మాత్రమేనని, ఇది లీజు పద్ధతిలో చేసిన కేటాయింపు మాత్రమేనని ఆయన తెలిపారు. పర్యావరణ అనుమతులు, భూకేటాయింపు అంశాలను ఒకే వ్యాజ్యంలో సవాలు చేయడం సాధ్యం కాదని ఆయన వాదించారు. పర్యావరణ అనుమతులపై అభ్యంతరాలుంటే జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించాలని సూచించారు.
ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పురపాలక, రెవెన్యూ, పర్యావరణ, దేవాదాయ శాఖలతో పాటు ఐటీ శాఖ, పీసీబీ, ఏపీఐఐసీ, దేవాదాయ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, విశాఖ కలెక్టర్, సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. హైపర్ స్కేల్ డేటాసెంటర్ పార్క్ లిమిటెడ్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ కోసం కేసు వాయిదా పడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















