సింగరేణి విస్తరణకు మరో కీలక అడుగు పడింది. కర్ణాటక విద్యుత్ సంస్థ (కేపీసీఎల్)తో కలిసి జాయింట్ వెంచర్‌గా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. బెంగళూరులో కర్ణాటక ఇంధనశాఖ మంత్రి కె.జె. జార్జ్‌తో జరిగిన సమావేశంలో ఇంధన రంగ అభివృద్ధి, బొగ్గు సరఫరా, సాంకేతిక సహకారం అంశాలపై చర్చించారు.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాల కార్యకలాపాల్లో సింగరేణితో కేపీసీఎల్ భాగస్వామ్యం కావాలని భట్టి సూచించారు. దీనిపై కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో పారిశ్రామిక వృద్ధితో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి బొగ్గు సరఫరాను కొనసాగించాలని మంత్రి జార్జ్ కోరగా.. భట్టి అంగీకారం తెలిపారు.
ఇదే పర్యటనలో రాయచూరు జిల్లా దేవదుర్గ్ తాలూకా లింగదహళ్లి గ్రామంలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన బంగారం, రాగి ఖనిజ అన్వేషణ పనులను భట్టి విక్రమార్క ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ్ బ్లాక్ అన్వేషణ హక్కులను సింగరేణి దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు.
దేవదుర్గ్ ప్రాంతంలో ఖనిజ సంపద అందుబాటులోకి వస్తే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భట్టి పేర్కొన్నారు. సింగరేణి తరఫున త్వరలో కార్యాలయం, హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అనంతరం ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించిన భట్టి.. అధికారులు చేపడుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. లింగదహళ్లి గ్రామంలోని పరమానంద శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















