తెలుగు భాషపై ఉన్న అభిమానాన్ని ఓ నేతన్న తన కళతో చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు నల్ల జగదీశ్ చేనేత చీరపై తెలుగు అక్షరమాలను అద్భుతంగా నేశారు.
ఈ ప్రత్యేకమైన చీరపై తెలుగు వర్ణమాలలోని అ నుంచి ఱ వరకు అక్షరాలను ఎంతో శ్రద్ధతో అల్లారు. చీర పల్లూపై నెమళ్లు, జింకలు, పాలపిట్టల చిత్రాలను అందంగా తీర్చిదిద్ది చేనేత కళకు మరింత అందాన్ని జోడించారు.
6.30 మీటర్ల పొడవు, సుమారు 600 గ్రాముల బరువున్న ఈ చీరను తయారు చేసేందుకు జగదీశ్‌కు దాదాపు 15 రోజుల సమయం పట్టింది. ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా నేసేందుకు ప్రత్యేక శ్రమ, నైపుణ్యాన్ని వినియోగించారు.
తెలుగు భాష గొప్పతనాన్ని చాటే ఈ చీరను వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారికి సమర్పించనున్నట్లు జగదీశ్ తెలిపారు. చేనేత కళలో భాషాభిమానాన్ని మేళవించిన ఈ ప్రయత్నం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















