దేశంలో ఉద్యోగ అవకాశాల స్వరూపం వేగంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం విద్యార్హతలకే ప్రాధాన్యం ఉండగా.. ఇప్పుడు నైపుణ్యాలు ఉన్నవారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన వివరాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉద్యోగ మార్కెట్‌లో కీలకంగా మారుతున్నాయి. ఈ మార్పును అందిపుచ్చుకున్న ఉత్తరప్రదేశ్ 78.64 శాతం ఎంఫ్లాయబిలిటీ రేటుతో దేశంలో అగ్రస్థానాన్ని సాధించింది.
ఇప్పటివరకు ఐటీ రంగంలో ముందంజలో ఉన్న కర్ణాటక, ఆర్థిక కేంద్రంగా పేరొందిన మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు స్కిల్ ర్యాంకింగ్‌లో వెనుకబడ్డాయి. యువతలో డిజిటల్ నైపుణ్యాలు పెరగడం, కొత్త కోర్సులు నేర్చుకోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందడం యూపీ విజయానికి కారణాలుగా నిలిచాయి.
ఉద్యోగ అర్హతలో మహిళలు తొలిసారి పురుషులను అధిగమించడం ఈ నివేదికలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల్లో 54 శాతం మంది ఉద్యోగాలకు సిద్ధంగా ఉండగా.. పురుషుల్లో ఈ సంఖ్య 51.5 శాతంగా నమోదైంది.
చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న మహిళలు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, విద్య, డిజిటల్ సేవల రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు.
భవిష్యత్ ఉద్యోగ ప్రపంచాన్ని కృత్రిమ మేధ (ఏఐ), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకున్న వారికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు పెరుగుతున్నాయి.
కేవలం డిగ్రీ పూర్తి చేయడం కాకుండా.. పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కలయికే ఉద్యోగ విజయానికి మార్గంగా మారుతోంది.
సాంప్రదాయ ఉద్యోగ విధానాలు కూడా మారుతున్నాయి. ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ అవకాశాలు పెరుగుతున్నాయి. 2030 నాటికి కోట్లాది మంది ఈ రంగాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
మొత్తంగా చూస్తే.. భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించాలంటే డిగ్రీతో పాటు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















