ఉత్తర కొరియా అధినేత Kim Jong Un తన రాజకీయ వారసత్వాన్ని కుమార్తె Kim Ju Aeకు అప్పగించే అవకాశాలున్నాయని దక్షిణ కొరియా నిఘా సంస్థ National Intelligence Service అంచనా వేసింది. ఈ దిశగా కిమ్ ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ, సైనిక అధికారులకు స్నైపర్ రైఫిళ్లను బహుమతిగా అందజేసిన సందర్భంలో కిమ్ జు యే రైఫిల్‌ను ఎయిమ్ చేసిన ఫొటోలు విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయుధ పరీక్షలు, మిలిటరీ పరేడ్‌లు వంటి కీలక కార్యక్రమాల్లో ఆమె తండ్రి వెంట పాల్గొనడం కూడా ఆమెను భవిష్యత్ నాయకురాలిగా తయారు చేస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
ఇటీవల జరిగిన వర్కర్స్ పార్టీ సదస్సులో ప్రభుత్వ, సైనిక అధికారులకు కృతజ్ఞతగా రైఫిళ్లు బహూకరించినట్లు సమాచారం. అదే సమయంలో కిమ్ సోదరి Kim Yo Jong పార్టీ కేంద్ర కమిటీ జనరల్ అఫైర్స్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెల్లడించాయి. ఉత్తర కొరియాలో పురుషాధిక్య నాయకత్వ సంప్రదాయం ఉన్నప్పటికీ, తాజా పరిణామాలు కిమ్ జు యే వారసురాలిగా ఎదుగుతున్న సంకేతాలు ఇస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















