పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉండగా, ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. మిగిలిన యాక్షన్ సన్నివేశాలు, కీలక ఘట్టాల చిత్రీకరణను వేగంగా పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లిరికల్ సాంగ్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, ఈ నెలలోనే ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఆయన అందించిన ట్యూన్స్‌పై టీమ్ పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు విజువల్ గ్రాండ్యూర్ తీసుకురానుంది.
యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















