జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంజిన్ స్టార్టర్ వ్యవస్థలో గుర్తించిన సాంకేతిక లోపాల కారణంగా వాహనాల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని కంపెనీ తెలిపింది.
2020 నుంచి 2022 మధ్య ఉత్పత్తి చేసిన మొత్తం 16 మోడళ్లలో ఈ సమస్య ఉన్నట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు. సుమారు 5,75,000 వాహనాలు ఈ లోపం ప్రభావానికి గురయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
కంపెనీ చేసిన ఉత్పత్తి తనిఖీలు మరియు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా స్టార్టర్ మోటార్‌లోని మాగ్నెటిక్ స్విచ్‌లు ఎక్కువసార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అరిగిపోతున్నట్లు గుర్తించారు. దీంతో కారు స్టార్ట్ కావడం కష్టమవుతుందని, కొన్ని సందర్భాల్లో ఇది వాహనంలో మంటలకు దారితీయొచ్చని బీఎండబ్ల్యూ స్పష్టం చేసింది.ప్రభావిత వాహనాల యజమానులను సమీప డీలర్‌షిప్‌లను సంప్రదించి అవసరమైన సాంకేతిక తనిఖీలు, మరమ్మతులు చేయించుకోవాలని కంపెనీ సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















