ప్రజలు డిజిటల్ విధానాల్లో (పీఎస్ఓ, QR కోడ్, PhonePe, Google Pay వంటి) చేసే చెల్లింపుల వివరాలను సేకరించి, భవిష్యత్తులో పన్ను వసూళ్లను పెంచే అవకాశాలపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నేతృత్వంలో, వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
- 30 రోజుల్లో ప్రాథమిక, 60 రోజుల్లో తుది నివేదిక సమర్పించాలి.
- రియల్ టైం డేటా సేకరణ కోసం “Revenue One” పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
- పోర్టల్‌లో డేటా సమీకరణ ద్వారా వ్యాపార సంస్థల వాస్తవ ఆదాయం, జీఎస్‌టి, వ్యాట్ వంటి వివరాలను పోల్చి పన్ను వసూళ్లలో ఎగవేతలను అడ్డుకోవడం లక్ష్యం.
- ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలించి, స్థానిక సంస్థలకు వినోద పన్ను విధించే అవకాశాలపై కూడా అధ్యయనం చేయాలి.
కమిటీ సభ్యులు:
- ఛైర్మన్: రాష్ట్ర CS
- కన్వీనర్: వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి
- ఇతర సభ్యులు: మున్సిపల్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక-ఉపాధి కల్పన, గనులు, ఆర్థిక, రిజిస్ట్రేషన్లు, న్యాయ, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















