హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. సూడాన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడిలో ఎబోలా వైరస్‌కు సంబంధించిన హిస్టరీ ఉన్నట్లు గుర్తించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మహ్మద్ అనే ప్రయాణికుడికి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఆరోగ్య పరీక్షల కేంద్రంలో సాధారణ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అతనికి ఎబోలా వైరస్‌కు సంబంధించిన రిస్క్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించిన వైద్య సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు.ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా Gandhi Hospitalలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అతని రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం Centre for Cellular and Molecular Biologyకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎబోలా వైరస్ సోకిందా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది.ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం అనుమానిత కేసు మాత్రమేనని ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులపై స్క్రీనింగ్ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















