హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘పారిస్ ఫ్యాషన్ వీక్ 2026’లో ఆమె తన ప్రత్యేకమైన ఫ్యాషన్ శైలితో ఆకట్టుకున్నారు.
పారిస్‌లో ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగిన ఫ్యాషన్ వీక్‌లో వరుసగా మూడు రోజుల పాటు సుధారెడ్డి విభిన్నమైన డిజైన్లతో రూపొందించిన దుస్తులు, అరుదైన వజ్రాభరణాలతో సందడి చేశారు. ప్రతి రోజు ఆమె ధరించిన వస్త్రధారణ, ఆభరణాలు ఫ్యాషన్ వర్గాల దృష్టిని ఆకర్షించాయి.
మూడో రోజు జరిగిన ప్రత్యేక వేడుకలో సుధారెడ్డి ధరించిన ఆభరణాల కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వజ్రాభరణాల మొత్తం విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని సుధారెడ్డి ఫౌండేషన్ వెల్లడించింది. అరుదైన వజ్రాలు, అత్యున్నత నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై భారతీయ వైభవం, హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా తన దుస్తులు, ఆభరణాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. సంప్రదాయం, ఆధునికత కలయికతో రూపొందించిన ఆమె ఫ్యాషన్ స్టైల్ పలువురి ప్రశంసలు అందుకుంది.
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం ద్వారా భారతీయ ఫ్యాషన్, ఆభరణాల డిజైన్ రంగానికి ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు లభించిందని ఫ్యాషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే సుధారెడ్డి, తన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, సెలబ్రిటీలు పాల్గొనే ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై హైదరాబాద్‌కు చెందిన సుధారెడ్డి ప్రదర్శించిన ప్రత్యేక శైలి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















