దేశంలోని అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఝార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఉన్న అడవులు అత్యంత విలువైనవి, సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలతో కూడుకున్నవని, వాటిని తప్పనిసరిగా సంరక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఝార్ఖండ్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం, రక్షిత అడవుల సరిహద్దులకు ఒక కిలోమీటరు దూరం వరకూ రాళ్ల తవ్వకాలు, స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయరాదని పేర్కొంది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గతంలో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రాళ్ల తవ్వకాలు, క్రషింగ్ యూనిట్లకు సంబంధించి కనీస దూర నిబంధనను సవరించి 250 మీటర్లకు తగ్గించిన విషయంపై కూడా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం అటవీ పరిరక్షణకు హానికరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
దీనిపై స్పందించిన హైకోర్టు, అడవులకు ఒక కిలోమీటరు దూరం వరకూ రాళ్ల తవ్వకాలు, క్రషింగ్ యూనిట్లకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న సడలింపులను సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















