భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కొలంబోలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యను కలిశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొలంబో వెళ్లిన సూర్య.. అక్కడ సనత్‌తో సరదాగా మాట్లాడాడు. ప్రస్తుతం శ్రీలంకలో టీమ్‌ఇండియా పర్యటిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సందర్భంగా సనత్ జయసూర్య ఫిట్‌నెస్‌ను సూర్యకుమార్ ప్రశంసించాడు. ‘‘హాయ్ సర్.. మీరు చాలా ఫిట్‌గా ఉన్నారు. ఏంటి పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? వందశాతం ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారు’’ అంటూ సరదాగా ప్రశ్నించాడు. సూర్య వ్యాఖ్యలకు సనత్ నవ్వుతూ స్పందించాడు.
ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యకుమార్ యాదవ్ సరదా సంభాషణపై అభిమానులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. సనత్ జయసూర్య శ్రీలంక క్రికెట్‌లో అత్యంత గుర్తింపు పొందిన ఆటగాళ్లలో ఒకరు కాగా.. సూర్యకుమార్ టీ20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















