క్యారెట్ (Carrot) తింటే కళ్లకు మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. కానీ అదే క్యారెట్ మన దంతాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. అందుకే నిపుణులు క్యారెట్‌ను “నేచురల్ టూత్ బ్రష్” అని పిలుస్తున్నారు.
క్యారెట్‌ను నమలడం వల్ల దంతాలపై పేరుకుపోయిన జిగట, ఆహార అవశేషాలు సహజంగా తొలగిపోతాయి. ఇది పళ్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత క్యారెట్ ముక్కలు నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి, నోటిలోని హానికర బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యారెట్లో ఉన్న విటమిన్ A, విటమిన్ K, బయోటిన్ వంటి పోషకాలు దంతాల చిగుళ్లను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, చిగుళ్ల సమస్యలు రాకుండా కాపాడుతాయి.అందుకే రోజువారీ ఆహారంలో క్యారెట్‌ను చేర్చుకోవడం ద్వారా సహజంగా పళ్ల సంరక్షణ పొందవచ్చు. ఆరోగ్యకరమైన చిరునవ్వు కోసం క్యారెట్‌ను మీ డైట్లో భాగం చేసుకోండి!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















