తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు జాబితా తయారీ ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం చేపట్టనున్నారు.
పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈ నెల 20న ఎన్నికల కమిషన్ పబ్లిక్ నోటీసు జారీ చేయనుంది. నవంబరు 6 వరకు ఓటరు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వాటిని పరిశీలించిన అనంతరం డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న పట్టభద్రులు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్సీలు వాణిదేవి, తీన్మార్ మల్లన్న పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















