‘మన భూమి–మన పంట–మన వంట’ అనే భావనతో రైతులకు, సంప్రదాయాలకు చేయూత ఇవ్వాలని సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. జాతీయ రహదారుల వెంట రైతు సొసైటీలకు ఐదు ఎకరాలు లీజుపై కేటాయించి ‘తెలుగుదనం’ వేదికలను ఏర్పాటు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 600 రకాల సంప్రదాయ వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తామని ప్రతిపాదించారు.
ఈ వేదికల ద్వారా అమ్మమ్మ, నానమ్మల చేతివంటల రుచిని తిరిగి ప్రజల్లోకి తీసుకురావడమే కాకుండా, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుబజార్లు, శిల్పారామాల తరహాలో ఇవి కూడా వ్యవసాయం, సంస్కృతికి ఊతమివ్వగలవని పేర్కొన్నారు. సుభాష్ పాలేకర్ సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
విశాఖపట్నంలో నిర్వహించిన ‘భోజన పండగ’, ‘సబల’ వంటి కార్యక్రమాలకు భారీ స్పందన లభించిందని, ప్రజల్లో సంప్రదాయ వంటలపై ఆసక్తి ఇంకా బలంగానే ఉందని విజయ్‌రామ్ తెలిపారు. ‘తెలుగుదనం’ వేదికలపై వంటలతో పాటు పచ్చళ్లు, నూనెల తయారీ, మట్టి పనులు, బుట్టల అల్లిక వంటి గ్రామీణ నైపుణ్యాలను కూడా నేర్పించనున్నట్లు చెప్పారు.
ఇక జానపద కళలు, తెలుగు సాహిత్యం, మహనీయుల గాథలు పరిచయం చేస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే కేంద్రాలుగా ఈ వేదికలను అభివృద్ధి చేయాలని ప్రణాళిక వివరించారు. అలాగే గో ఆధారిత వ్యవసాయం, వాననీటి సంరక్షణ, దేశీయ విత్తనాల పరిరక్షణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.ప్రతి జిల్లాలో ఈ వేదికలను అభివృద్ధి చేసి, వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలకు కూడా ఉపయోగపడేలా రూపకల్పన చేయాలని ప్రతిపాదించారు. రైతులకు ఆదాయం, సంప్రదాయాలకు గౌరవం—రెండింటినీ కలిపే ప్రాజెక్ట్‌గా ‘తెలుగుదనం’ వేదికలను అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని విజయ్‌రామ్ పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















